Mammootty: రోజుకు రూ.5 కోట్లు.. పవర్ స్టార్‌నే మించిన కేరళ స్టార్..?

పవన్ రోజుకి 2 కోట్లు, అలా మొత్తంగా 20 రోజుల్లో 40 కోట్లు తీసుకున్నాడన్న వార్త ఆమధ్య సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు అంతకు మించే న్యూస్‌తో షాక్ ఇచ్చాడు మలయాళ స్టార్ మమ్ముట్టి.

Post Published By: narender Thiru
Updated : 25 July 2023, 9:32 AM IST

Mammootty: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజు, ఇమేజు, మార్కెట్‌లో మైలేజే వేరు. అందుకే తను గెస్ట్ రోల్ వేసిన బ్రో మూవీ విడుదలకు ముందే రూ.200 కోట్ల వ్యాపారం చేసేసింది. ఇందులో పవన్ రోజుకి 2 కోట్లు, అలా మొత్తంగా 20 రోజుల్లో 40 కోట్లు తీసుకున్నాడన్న వార్త ఆమధ్య సెన్సేషన్ క్రియేట్ చేసింది.

కట్ చేస్తే ఇప్పుడు అంతకు మించే న్యూస్‌తో షాక్ ఇచ్చాడు మలయాళ స్టార్ మమ్ముట్టి. రోజుకి రూ.5 కోట్ల రెమ్యునరేషన్‌తో పవన్‌నే మించిపోతున్నాడీ సీనియర్ స్టార్. ఆమధ్య తెలుగులో యాత్ర మూవీతో హిట్ మెట్టెక్కిన మమ్ముట్టి యాత్ర-2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కాకపోతే ఇందులో తను వేసేది గెస్ట్ రోలే. అందుకు గాను రెండు రోజులు నటిస్తే సరిపోతుంది. కాని అక్కడే కిటుకు పెట్టాడు మమ్ముటి. యాత్ర-2లో కూడా వైఎస్ పాత్ర తనే వేయాల్సి రావటం, గతంలో తను వేసిన పాత్ర కావటంతో అంతా తనకే కనెక్ట్ అవుతున్నారు.

అందుకే నచ్చినంత డిమాండ్ చేస్తున్నాడో, లేదంటే మరో కారణమో కాని, 2 రోజుల కాల్ షీట్స్‌కి ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. అంటే రోజుకి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్టే. అక్కడే పవన్ రికార్డుని మమ్ముట్టి బ్రేక్ చేసేలా ఉన్నాడు.

Published : 
  • 25 July 2023, 9:32 AM IST