Chiranjeevi: కొత్త లుక్‌తో మెగా కిక్ ఇస్తున్న మెగాస్టార్..!

తన కొత్త హేయిర్ స్టైల్, మీసకట్టు, మొత్తంగా తన లుక్కే పాతికేళ్లు వెనక్కి తీసుకెళుతోంది. అంతగా చిరు మారింది ఏ సినిమా కోసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. విశ్వంభరలో ఓ దేవకన్యను వెతుక్కుంటూ ముల్లోకాలు తిరిగే జగదేక వీరుడిగా చిరు కినిపించబోతున్నాడన్నారు.

Post Published By: narender Thiru
Updated : 9 December 2023, 8:00 PM IST

Chiranjeevi: మెగాస్టార్ కొత్త హెయిర్ స్టైల్ ఒకప్పటి చిరుని గుర్తుకు తెస్తోంది. పాతికేళ్లక్రితం చిరు ఎలా ఉండేవారో.. ఇప్పుడు చిరు తనని తాను అలా చూపించే ప్రయత్నం చేశారు. తన కొత్త హేయిర్ స్టైల్, మీసకట్టు, మొత్తంగా తన లుక్కే పాతికేళ్లు వెనక్కి తీసుకెళుతోంది. అంతగా చిరు మారింది ఏ సినిమా కోసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. విశ్వంభరలో ఓ దేవకన్యను వెతుక్కుంటూ ముల్లోకాలు తిరిగే జగదేక వీరుడిగా చిరు కినిపించబోతున్నాడన్నారు.

Aishwarya Rai Bachchan: ఐశ్వర్య రాయ్ విడాకులు.. రూమర్స్ కావా.?

కథ పూర్తిగా అదే అయినా.. కాకున్నా.. కాన్సెప్ట్ అదే అని తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం మాత్రం చిరంజీవి ఇలా మేకోవర్ వేసుకోవట్లేదట. అది దిల్ రాజు బ్యానర్‌లో అనిల్ రావిపుడి మేకింగ్‌లో చిరు చేసే సినిమాకోసం ఇలాంటి మేకోవర్ ప్లాన్ చేశారట. విచిత్రం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు టైం పట్టేలా ఉంది. అందుకని చిరుకి బాగా కుదిరిన ఈ లుక్‌ని విశ్వంభరకి వాడుకోబోతున్నాడట డైరెక్టర్ వశిష్ట. ఇది అనిల్‌కి పంచ్ అయినా మెగాస్టార్ ఫ్యాన్స్‌కి మాత్రం కిక్ ఇచ్చే అంశం.

Published : 
  • 9 December 2023, 8:00 PM IST