Naresh: నరేష్ – పవిత్ర… మధ్యలో రమ్య!

ACTOR NARESH - PAVITHRA LOKESH

Post Published By: Srikar Creator
Updated : 31 January 2023, 11:20 AM IST

మాజీ హీరో, సీనియర్ నటుడు నరేష్ (Naresh), నటి పవిత్ర లోకేశ్ (Pavithra Lokesh) ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు వాళ్లిద్దరూ.! అయితే వాళ్లిద్దరి మధ్యలో నరేశ్ భార్య రమ్య పెద్ద అడ్డంకిగా మారారు. ఆమె నుంచి విడాకులకోసం నరేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రమ్యతో విడాకులు వస్తే కానీ పవిత్ర లోకేశ్ తో పెళ్లి ముందుకు సాగదు. దీంతో రమ్య నుంచి ఎలాగైనా బయటపడాలనుకుంటున్నారు నరేశ్.

నరేశ్ (Naresh) తన మూడో భార్య రమ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. రమ్య (Ramya) నుంచి తనకు ప్రాణ హాని ఉందన్నారు. ఆస్తికోసం తనను చంపే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఇదే విషయమై ఆయన కోర్టును కూడా ఆశ్రయించినట్లు వెల్లడించారు. గచ్చిబౌలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. రోహిత్ శెట్టితో కలసి రమ్య తనను చంపేందుకు కుట్రలు చేస్తోందన్నారు నరేశ్. ఆమెతో తాను నరకాన్ని అనుభవిస్తున్నానని… తనను చంపేస్తారనే భయంతో ఒంటరిగా బయటకు కూడా వెళ్లలేకపోతున్నానని చెప్పారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్ ను రమ్య హ్యాక్ చేయించి… తన పర్సనల్ మెసేజ్ లను చూసేదని అన్నారు. తనకు రమ్యతో విడాకులు ఇప్పించాలని కోరారు.

2010 మార్చిలో రమ్య (Ramya) తో తనకు బెంగళూరులో పెళ్లి జరిగిందని నరేశ్ తెలిపారు. కట్నం తీసుకోకుండానే తాను పెళ్లి చేసుకున్నానని… తన తల్లి విజయ నిర్మల (Vijaya Nirmala) ఆమెకు రూ.30 లక్షల విలువైన ఆభరణాలను చేయించిందని చెప్పారు. అయితే, పెళ్లైన కొన్ని నెలల నుంచే రమ్య తనను వేధించడం ప్రారంభించిందన్నారు. తనకు తెలియకుండానే కొందరు వ్యక్తుల నుంచి, బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుందని, లక్షల రూపాయల అప్పులు చేసిందన్నారు నరేశ్. ఆమె చేసిన అప్పుల్లో తాను రూ. 10 లక్షలను తీర్చేశానన్నారు. తమకు 2012లో రణవీర్ (Ranaveer) అనే కుమారుడు పుట్టాడని వెల్లడించాడు.

అయితే నరేష్ ముందుగా సీనియర్ కెమెరా మెన్ శ్రీనివాస్ కుమార్తె రేఖను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ కొడుకు పుట్టాడు. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు అయిన వెంటనే రెండో పెళ్లి చేసుకున్నారు నరేష్. ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇక పోతే ముచ్చటగా మూడో సారి మాజీ మంత్రి రఘువీరారెడ్డి (Ex. Minister Raghuveera Reddy) తమ్ముడి కుమార్తె రమ్య రఘుపతిని పరిణయమాడారు. ప్రస్తుతం వీళ్లిద్దరికీ గొడవల కారణంగా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు నరేశ్.. పవిత్రా లోకేష్ (Pavithra Lokesh) తో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. 5ఏళ్ల క్రితం హ్యాపీ వెడ్డింగ్ సినిమా సమయంలో వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. సమ్మోహనం సమయంలో ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పటి నుంచే వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నట్లుగా ప్రచారం సాగింది. వయసులో పవిత్ర కన్నా నరేష్ 20ఏళ్లు పెద్ద. అయినా ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. ఆ మధ్య మైసూర్ హోటల్లో వీళ్లిద్దరూ రమ్య కంటపడ్డారు. దీంతో పవిత్ర పై రమ్య చెప్పు విసిరారు. అప్పట్లో ఇది పెద్ద రచ్చే అయింది.

ఆ సమయంలోనే పవిత్ర లోకేశ్ భర్త తెరపైకి వచ్చారు. తమకు 16 ఏళ్ల క్రితమే పెళ్లయినట్లు సుచేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. అయినా నరేశ్ (Naresh) – పవిత్ర లోకేశ్ (Pavithra Lokesh) కలిసే ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. వీడియో టీచర్ కూడా రిలీజ్ చేశారు. అయితే రమ్యతో విడాకులు ఇంకా మంజూరు కాకపోవడంతో ఇబ్బందిగా మారింది. అందుకే తనకు విడాకులు కావాలని నరేశ్ కోర్టును ఆశ్రయించారు. మరి రమ్యతో విడాకులు మంజూరవుతాయా..? పవిత్ర లోకేశ్ తో మూడు ముళ్లు పడతాయా..? అనేదే ఇప్పుడు ఉత్కంఠ కలిగించే అంశం.

Published : 
  • 27 January 2023, 8:16 AM IST