Nayanthara: వంద కోట్లు ఇస్తా వస్తావా.. దొబ్బేయ్ రా.. నయన డోంట్ కేర్ ఆన్సర్

నయన్ ఒక్కో మూవీకి సుమారు రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఓ సినిమాకి ఇంతకు రెట్టింపు ఇస్తానని చెప్పాడట ఓ హీరో. కానీ ఆ మూవీని బ్యూటీ తిరస్కరించిందని తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 26 February 2024, 3:27 PM IST

Nayanthara: సినీ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్‌కు ఉంటే క్రేజ్ వేరు. ఫలానా హీరోతో, హీరోయిన్ ఉంటే బాటుంటుందని ఫ్యాన్స్‌తో పాటు మేకర్స్ కూడా లెక్కలేసుకుంటారు. అయితే స్టార్ హీరోయిన్ నయనతారతో నటించాలని ఓ హీరో తెగ ఆరాటపడ్డాడట. ప్రజెంట్ ఈ లేడీ సూపర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీగా గడుపుతుంది. నాలుగు పదుల వయసు దగ్గరికొచ్చినా.. యంగ్ హీరోయిన్‌లకు ఏ మాత్రం తీసిపోని అందంతో మాయ చేస్తుంది. ఓ వైపు కమర్షియల్ సినిమాలు.. మరోవైపు లేడీ ఓరియెంట్ సినిమాలు.. ఇలా తీరిక లేకుండా సినీ కెరీర్‌ను సాగిస్తుంది.

IND VS ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నెగ్గిన భారత్.. 3-1తో సిరీస్ కైవసం..

అయితే ఈ బ్యూటీ ఓ సినిమాను రెజెక్ట్ చేసిన విషయం ఆలస్యంగా బయటకు రాగా వైరల్‌గా మారింది. నయనతార.. సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు. నయన్ ఒక్కో మూవీకి సుమారు రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఓ సినిమాకి ఇంతకు రెట్టింపు ఇస్తానని చెప్పాడట ఓ హీరో. కానీ ఆ మూవీని బ్యూటీ తిరస్కరించిందని తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు.. తమిళనాడు బిగ్గెస్ట్ బిజినెస్‌మ్యాన్.. లెజెండ్ శరవణన్. ‘ది లెజెండ్’ అనే మూవీతో 2022లో ప్రేక్షకుల ముందుకువచ్చాడు శరవణన్. కానీ ఆ మూవీ దారుణమైన కలెక్షన్లతో పాటుగా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ కోసం ఎంతో లావిష్‌గా ఖర్చు పెట్టినా.. ప్రేక్షకులు మాత్రం ఇతని ముఖం చూడడానికి ఇష్టపడలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా.. పట్టువదలని విక్రమార్కుడిలా ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానంటూ ఈ మధ్యే చెప్పాడు శరవణన్. అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా నయనతారను తీసుకుందామని అనుకున్నారట.

అందుకోసం భారీ మెుత్తంలో రెమ్యునరేష్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాట శరవణన్. కానీ నయన్ మాత్రం అతడి పక్కన రూ.100 కోట్లు ఇచ్చినా నటించనని డైరెక్ట్‌గానే చెప్పేసిందని సమాచారం. అప్పట్లో నయన్ ఇంటి ముందు రోజూ రోల్స్ రాయిస్ కారు ఉండేదట. ఆ లగ్జరీ కారు శరవణన్‌దే. ఆమెను సినిమా కోసం ఒప్పించేందుకు చాలాసార్లు ఆమె ఇంటికి వెళ్లేవాడట. ఎన్నిసార్లు నయన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. పాపం కనికరించలేదు. దీంతో కసితో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటెలాను దింపాడు లెజెండ్ శరవణన్. ఈ సినిమా కోసం ఊర్వశీ బాగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
https://youtu.be/GCC94Iu2SgE

Published : 
  • 26 February 2024, 3:27 PM IST