Sakshi Vaidya: రెండో ఐరన్ లెగ్.. ఆమె సినిమా చేస్తే ఫ్లాపేనా..?

గ్లామర్ ఉంది. అందాలు ఆరబోసే టాలెంట్ ఉంది. ఇక పెర్ఫామెన్స్‌లో కూడా పర్లేదనే పేరొచ్చింది. కాని తన అదృష్టమే నిర్మాతలకు అరిష్టంగా మారుతోంది. లాస్ట్ టైం ఏజెంట్ అంటూ అక్కినేని అఖిల్‌తో జోడీకట్టిన సాక్షి వైద్య.. రూ.90 కోట్ల బడ్జెట్‌తో మూవీ చేస్తే, అది డిజాస్టర్ అని తేలింది.

Post Published By: narender Thiru
Updated : 29 August 2023, 6:05 PM IST

Sakshi Vaidya: యంగ్ బ్యూటీ సాక్షి వైద్య ఇప్పడు టాలీవుడ్‌లో కొత్త ఐరన్ లెగ్. అందులోనూ.. ఐరన్ అంటే అలాంటిలాంటి ఐరన్ లెగ్ కాదు. తుప్పట్టిన ఐరన్ లెగ్ అంటున్నారు సినిమా జనాలు. గ్లామర్ ఉంది. అందాలు ఆరబోసే టాలెంట్ ఉంది. ఇక పెర్ఫామెన్స్‌లో కూడా పర్లేదనే పేరొచ్చింది. కాని తన అదృష్టమే నిర్మాతలకు అరిష్టంగా మారుతోంది. లాస్ట్ టైం ఏజెంట్ అంటూ అక్కినేని అఖిల్‌తో జోడీకట్టిన సాక్షి వైద్య.. రూ.90 కోట్ల బడ్జెట్‌తో మూవీ చేస్తే, అది డిజాస్టర్ అని తేలింది.

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో జోడీ కట్టి గాండీవధారి అర్జున మూవీ చేస్తే అది మరొక డిజాస్టర్ అయి కూర్చుంది. అంతే.. వెంటనే పూజాహెగ్డే చెల్లెలు వచ్చిందిరా అంటూ కామెంట్ పెంచారు. కన్నడ లేడీ పూజా హెగ్డే వరుసగా 5 ఫ్లాపులతో ఇక్కడ ఐరన్ లెగ్ అనిపించుకుంది. కాని గతంలో తనకు అరడజనుకు పైనే హిట్లు, బ్లాక్ బస్టర్లు పడ్డాయి. మరో కన్నడ లేడీ కృతి శెట్టి, రష్మికా మందన్న కూడా పెద్ద హిట్లతో పాటు చిన్న ప్లాపుల్ని ఫేస్ చేస్తేనే ఐరన్ లెగ్ అన్నారు. అలాంటిది వరుసగా రెండు డిజాస్టర్లు.. అది కూడా కెరీర్‌లో మొదటి రెండు సినిమాలు డిజాస్టర్ అవటంతో ఇక సాక్షి వైద్యని ఐరన్ లెగ్ అనకుండా ఉంటారా..?

అందుకే రవితేజ ఈగిల్, పవర్ స్టార్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ టీం కూడా ఆలోచనలో పడిందట. శ్రీలీల కాకుండా మరో హీరోయిన్ పాత్రలో సాక్షిని తీసుకున్న ఉస్తాద్.. టీం, తనని పక్కనపెట్టే ఆలోచనలో ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

Published : 
  • 29 August 2023, 6:05 PM IST