SRI REDDY: శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్‌ పెళ్లి.. సీతను నేనే అంటూ శ్రీరెడ్డి పోస్ట్‌..

అభిరామ్‌కు వరసకు మరదలు అయ్యే ప్రత్యూషతోనే అతని పెళ్లి జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో శ్రీలంకలో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు అభిరామ్‌. ప్రస్తుతం వీళ్ల పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది.

Post Published By: narender Thiru
Updated : 8 December 2023, 6:36 PM IST

SRI REDDY: దగ్గుబాటివారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. నిర్మాత సురేష్‌ బాబు చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు. అభిరామ్‌కు వరసకు మరదలు అయ్యే ప్రత్యూషతోనే అతని పెళ్లి జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో శ్రీలంకలో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు అభిరామ్‌. ప్రస్తుతం వీళ్ల పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే యాక్టర్‌ శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చింది.

Extra Ordinary Man Review: నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ హిట్ కొట్టినట్టేనా..!

అభిరామ్‌ పెళ్లి గురించి సంచలన కామెంట్స్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టింది. "మనం దేవతలుగా కొలిచే రాముడిని, సీతని విడదీసిన దేశం.. సీతాదేవి శాపాలకు నిలయం.. ఆంజనేయ కోపాగ్నిలో తగలబడిపోయిన దేశం.. అశోకవనంలో సీతమ్మ.. రాముని కోసం తిండి నిద్రలు మాని.. దుఃఖితురాలైన ఆ రాక్షస రావణలంక శ్రీలంకలో దగ్గుబాటి అభిరాం పెళ్లి చేసుకుంటున్నాడు. సూపర్‌.. రాక్షసులు ఎప్పటికైనా రాక్షసులే" అంటూ ట్వీట్‌ చేసింది. గతంలో శ్రీరెడ్డి, అభిరామ్‌ల వ్యవహారం చాలా చర్చనీయాంశంగా మారింది. అభిరామ్‌ తనను లైంగికంగా వాడుకుని మోసం చేశాడంటూ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. సినిమాలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి కూడా చాలా మందిపై ఆరోపణలు చేసి న్యూస్‌లో హైలెట్‌ అయ్యింది.

అలాంటి శ్రీరెడ్డి ఇప్పుడు అభిరామ్‌ పెళ్లి గురించి చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం తిట్టిపోస్తున్నారు. ఏదిఏమైనా ఈ పెళ్లి విషయంలో శ్రీరెడ్డి ఇలా ట్వీట్‌తో మధ్యలో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Published : 
  • 8 December 2023, 6:36 PM IST