South Indian Films: బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న సౌత్ సినిమా.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మనదే హవా..!

ఒక్కొక్క సినిమా కాదు షేర్ ఖాన్.. వంద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా పర్వాలేదు.. బాలీవుడ్‌ను షేక్ చేసి పాన్ ఇండియాలో వసూళ్ల వర్షం కురిపించే సత్తా కేవలం ఇప్పుడు సౌత్ ఇండియాకు మాత్రమే ఉంది. ఒకప్పుడు భారతీయ సినిమాలు అంటే బాలీవుడ్ గురించి మాత్రమే మాట్లాడుకునే వాళ్లు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై దక్షిణాది చిత్రాలు మెరిసిపోతున్నాయ్. ఖాన్‌లు, కపూర్‌ల రోజులు పోయాయ్.. పాన్ ఇండియాలో ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్న సినిమాలను దక్షిణాది పరిశ్రమ మాత్రమే అందిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్.. వీటి ముందు బాలీవుడ్ సినిమాలు తేలిపోతున్నాయ్. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్ వంటి భారీ చిత్రాలను, పాన్ ఇండియాలో వాటి విజయాన్ని చూసి చెబుతున్న మాటలు కావివి. సగటు ఇండియన్ ఆడియన్స్ సౌత్ సినిమాకు ఎలా కనెక్ట్ అయ్యాడో బాక్సాఫీస్ లెక్కలే చెబుతున్నాయ్.

Post Published By: Srikar Creator
Updated : 9 May 2023, 12:41 PM IST

Published : 
  • 9 May 2023, 12:41 PM IST

Exit mobile version