సూపర్ స్టార్ మహేశ్ బాబు మళ్లీ వారణాసి షెడ్యూల్ తో బిజీ అవుతున్నాడు. ఆల్రెడీ ప్రియాంక చోప్రా హైద్రబాద్ లో ల్యాండ్ అయ్యింది… అయితే ఇలా షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ అవుతూనే ఉంటాయి.. కాని ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటంటే, వారణాసి కథ ఏదో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఇండియానా జోన్స్ లా ఉంటుందనుకున్నారు… మన మైథాలజీకి, హాలీవుడ్ ఇండియానా జోన్స్ జోనర్ యాడ్ చేశారన్నారు. కాని , ఇది అంతకుమించేలా ఉంది. ఎందుకంటే హీరో పాత్ర వెనకే మహాభారతమంత పెద్ద చరిత్రే వినిపిస్తోంది… మహాభారతం చిన్న గాథ కాదు… పుంకాను పుంకాలు ఉంటది… అలాంటి బరువైన చరిత్ర ఒక పాత్రకే ఉందంటే ఊహకు అందరని కథాంశంతో ఈ సినిమా వస్తోందని తెలుస్తోంది… ఇంతవరకు హీరోగా తలలు లెక్కపెట్టేవాళ్లని చూశామా? స్మశానంలో మాత్రమే కనిపించే ఈ పరిస్తితి, వారణాసిలో హీరోయిజంలా ఎలివేట్ కాబోతోందా? మరణాల లెక్కగాడిగా కనిపించబోతున్న రుద్రుడి వెనక, పాత్రలే కాదు, వేరియేషన్స్ లెక్కలేనన్ని ఉండబోతున్నాయా? ఒక్కపాత్రే మహాభారతమంత ఉంటే, మిగతా పాత్రల పరిస్థితేంటి? ఇదంతా ఒక్క కథ లో చెప్పటం సాధ్యమా? అసలు రాజమౌళి ఏం చేస్తున్నాడు…? తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి, ఈ సినిమానే మొదటి మెట్టుగా వాడుతున్నాడా?
వారణాసి గ్లింప్స్ చూసి ఇదో ఇండియన్ మైథాలజీకి, టైమ్ ట్రావెల్ ని డైనోసార్లతో సాహాసలని కలిపి, హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ కి ఇండియన్ వర్షణ్ అనుకున్నారు. కాని కథలో లోతుకంటే, హీరో పాత్రలో లోతే అతి వీర భయంకరంగా ఉంది. కేవలం హీరో ఇందులో మూడు పాత్రలు వేస్తున్నాడు… అందులో రుద్రుడిగా ఒక పాత్ర, శివుడిగా, రాముడిగా కూడా కనిపిస్తాడనే ఇంతవరకు ప్రచారం జరిగింది.కాని ఒక్క రుద్రుడి పాత్రే మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. ఎందుకంటే ఇందులో రుద్రుడి పాత్ర తలలు లెక్కపెట్టడం.. అంటే మరణాల లెక్కగాడు.. వారణాసి అంటే అదేదో రెగ్యులర్ దైవస్థలం కాదు… ఒకప్పుడు తిరిగిరాకూడదనుకునేవాళ్లు, జీవితాన్ని ముగించేయాలనుకునే వాళ్లే వెళ్లే కాశీ నగరం… శివుడి నగరం.. చాలా పురాతన నగరం.
జీవితంలో పాపాలన్నీ గంగలో కడిగేసి, అక్కడే చనిపోతే, కపాల మోక్షం దొరుకుతుందని నమ్ముతారు.. కాని పాపాలు కడుక్కునే వాల్లను కర్మలా వెంటాడే పాత్రే రుద్రుడిదని తెలుస్తోంది. ఓరకంగా పేరుకే రుద్రుడి పాత్ర పెట్టినా ఇది మనుషులు చావాలకు సాక్షిగా, కాటికాపరిగా, కట్టెకాలకుండా పాపాల విరుగుడిగా చాలా లోతైన పాత్రగా రుద్రుడి పాత్ర ఉండబోతోందట.వారణాసి మూవీ 60శాతం పూర్తైతే కాని, అసలు రుద్రుడి పాత్రేంటో అర్ధం కానంత లోతైందని, ఆ బలమైన పాత్రకు, శివుడిని, రాముడిని జోడించి, బాహుబలికి వందల రెట్లు బలమైన స్క్రిప్ట్ తో ముందుకు వస్తున్నాడు రాజమౌలి. అందుకే బాహుబలి ఈ మూవీ ముందు చిన్న గులిక రాయనేంతగా, ఫిల్మ్ టీం హింట్ ఇస్తోంది. మరి గులిక రాయి లాంటి బాహుబలినే ఒక పార్టులో చెప్పలేకపోయిన రాజమౌళి, వారణాసిని ఒకే పార్ట్ గా తీస్తాడా? ఎంత మూడు నుంచి నాలుగు గంటల నిడివి ఉన్నా, అంత కథని, ఇంత నిడివిలోనే చెప్పగలడా? డౌటే..
దీనికి తోడు వరల్డ్ ఆడియన్స్ కోసం డైనోసార్ సాహసాలు, టైమ్ ట్రావెల్, ప్రపంచ ఏడు వింతలు, వాటికి మన మైథాలజీని కలుపుతూ, కథని ఎక్కించాలంటే, రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ కి గట్టిగానే పని చెప్పినట్టున్నాడు రాజమౌళి. ఏదేమైనా బాహుబలిని మించే ఊహకందని కంటెంట్ తో ఈ మూవీ రాబోతోంది. విలన్ పాత్ర ముక్తి సిండికేట్ అని, ఇక వారణాసిలో ప్రతీ మరణం ముందు హీరో ఉండి తీరాల్సి ఉంటుందని.. చాలా కీలకమైన అంశాలు బయటికొచ్చాయి… పాన్ వరల్డ్ గోడలు బద్దలు కొట్టేందుకు కావాల్సినంత కంటెంట్ తో ఇదొస్తోందని నమ్మకాన్ని ఈ లీకులు, అందులో అంశాలు క్రియేట్ చేస్తున్నాయి.