వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ హీరో ఎవరంటే, హాలీవుడ్ స్టార్ల పేర్లే వినిపిస్తాయి.. కాని విచిత్రంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పేరు వినిపించింది. 18 వేల కోట్ల ఆస్తులతో తనే వరల్డ్ నెంబర్ వన్ హీరో అంటున్నారు. కాని రెమ్యునరేషన్ లో మాత్రం ఈ స్టార్ పేరు హాలీవుడ్ హీరోల లిస్ట్ లో టాప్ టెన్ లిస్ట్ లో లేదు…కాని రెబల్ స్టార్ ప్రభాస్ పేరు హాలీవుడ్ టాప్ ఫైవ్ లో చేరిపోయింది. ఆసియా నెంబర్ వన్ హీరోగానే కాదు, ఇండియాస్ రిచ్చెస్ట్ స్టార్ గా ఎర్నింగ్స్ పరంగా తన పేరు మారుమోగుతోంది. స్థిరాస్తులు అటుంచితే, సినిమాకు రెమ్యూనరేషన్, యాడ్ ఎండోర్స్ మెంట్ లో కూడా షారుఖ్ ఖాన్ ని రెబల్ స్టార్ ప్రభాస్ మించిపోయాడు.. అలా అయితే తనెలా వరల్డ్ నెంబర్ వన్… అదే విషయంలో ఎందుకు రెబల్ స్టార్ నెంబర్ 3… ?
రెబల్ ప్టార్ ప్రభాస్ 5 పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్ గా కొనసాగుతున్నాడు. బాహుబలి 2 మూవీకి 1850 కోట్లు కల్కీకి 1200 కోట్లు, రావటంతో, వెయ్యికోట్లు దాటిన సినిమాలతో తనే టాప్ లో ఉన్నాడు. సలార్ కూడా 850 కోట్ల వరకు రాబట్టింది. అలా చూస్తే తన తర్వాతీ స్థానంలో, పటాన్, జవాన్ లాంటి హిట్లతో ఉన్నాడు షారుఖ్ ఖాన్. ఇవి కూడా వెయ్యికోట్ల క్లబ్ లో చేరిన సినిమాలే… అయితే ఇప్పుడు ఇది కాదు మ్యాటర్.. వరల్డ్ వైడ్ గా రిచ్చెస్ట్ స్టార్ అంటే ఎవరంటే నెం. 1 గా షారుఖ్ పేరే వినిపిస్తోంది
ఔను దాదాపు ఒకటిన్నర బిలియన్ల నుంచి రెండు బిలయన్ల వరకు స్థిర చర ఆస్తులతో వరల్డ్ నెంబర్ వన్ ఫిల్మ్ స్టార్ అనిపించుకున్నాడు. అంటే 12 వేలకోట్ల నుంచి 18 వేల కోట్ల వరకు ఇండియన్ కరెన్సీలో షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ ఉంటుందని తెలుస్తోంది.తర్వాతీ స్తానాల్లో ఆర్నాల్డ్ ష్వార్ష్ నెగ్గర్ నుంచి జాకీ జాన్ వరకు మిగతా టాప్ టెన్ లిస్ట్ లో ఉన్నారు.విచిత్రం ఏంటంటే ఒక్క హాలీవుడ్ మూవీ చేయకున్నా, పాన్ వరల్డ్ మార్కెట్ లో అంత సీన్ లేకున్నా, షారుక్ ఆస్తుల పరంగా, వరల్డ్ నెంబర్ వన్ రిచ్చెస్ట్ ఫిల్మ్ స్టార్ అయ్యాడు. తన మ్యాగ్జిమమ్ రెమ్యునరేషన్ కూడా జవాన్ కి 225 కోట్లే… అలా చూస్తే హాలీవుడ్ స్టార్స్ లిస్ట్ లో చేరే నెంబర్ ని రీచ్ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. అలా 550 కోట్ల డీల్ స్పిరిట్ కి అలానే కల్కీ 2 మూవీకి ఓకే అయ్యింది.
రెమ్యూనరేషన్, ప్రాఫిట్ లో షేర్ అలా అన్నికలుపుకుని 550 కోట్ల రెమ్యునరేషన్ అంటే, ఆసియాలోనే ఎవరూ తీసుకోనంత.. ఇక హాలీవుడ్ లో కూడా మొన్నటి వరకు జేమ్స్ బాండ్ మూవీకి డానియల్ క్రేక్ 670 కోట్ల వరకు తీసుకున్నాడు… సో దానికి ఒక వందకోట్లు తక్కు… ఎలా చూసినా వరల్డ్ వైడ్ గా సినిమాకు భారీ మొత్తంలో పారితోషికం తీసుకునే స్టార్స్ లిస్ట్ తీస్తే, వరల్డ్ టాప్ ఫైవ్ లో ప్రభాస్ పేరుంటుందని, గతంలోనే ప్రూవ్ అయ్యింది.కల్కీ 2 కి కూడా స్పిరిట్ రేంజ్ ఎమౌంటే, తీసుకుంటే, ఇక ఆ నెంబర్ తనకి స్థిరపడిపోతుంది. ఐతే బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ ఆస్తుల వివరాలున్నంత క్లియర్ గా సౌత్ స్టార్స్ డిటేల్స్ లేకే వరల్డ్ రిచ్చెస్ట్ స్టార్స్ లిస్ట్ లో మనోళ్ల పేరు వినిపించలేదు. కాని నిజానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లోనే, 35 వే లకోట్ల ఆస్తులతో కింగ్ నాగార్జునే నెంబర్ వన్ అంటారు. 22 వే లకోట్ల తో ప్రభాస్ నెంబర్ 2 అనంటున్నారు.. వీటికి ఆధారాలేంటో కాని, ఆసియాలో మాత్రం నెంబర్ 3, రిచ్చెస్ట్ స్టార్ మాత్రం ప్రభాసే అని అప్పట్లో వార్తొచ్చింది.. ఇప్పుడు షారుఖ్ ఆస్తులతో పోలిస్తే, తనకంటె కూడా ముందు వరుసలో ప్రభాస్, నాగార్జునే ఉండేలా ఉన్నారు.