పవన్ ను ఆకాశానికి ఎత్తేసిన హీరోయిన్, ఆయనే టాలీవుడ్ GOAT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ కు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 3 September 2024, 1:08 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ కు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. అటు పార్టీని, నియోజకవర్గాన్ని, కుటుంబాన్ని ముందుకు నడుపుతున్నారు ఆయన. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా బిజీ అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ మూడు సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేయాలని పవన్ పట్టుదలగా ఉన్నారు. ఇటీవల ఆ సినిమాలకు సంబంధించిన దర్శకులు నిర్మాతలు ఆయనను కలిసేందుకు అమరావతి కూడా వెళ్ళారు. అది అలా ఉంచితే నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. దీనితో ఆయన సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే విజయవాడలో భారీ వరదల కారణంగా పవన్ కూడా ఎక్కడా వేడుకల్లో పాల్గొనలేదు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రసంశల వర్షం కురిపించారు.

తన దృష్టిలో టాలీవుడ్ లో GOAT అంటే పవన్ కళ్యాణ్ అన్నారు ఆమె. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (goat) సినిమా ఈవెంట్ లో మాట్లాడిన ఆమె పవన్ ను ఆకాశానికి ఎత్తేసారు. తాను తెలుగులో చూసిన మొదటి సినిమా జల్సా అన్నారు. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాలు చూశానని చెప్పిన ఆమె... పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే సీనియర్ హీరోయిన్ స్నేహ సైతం... goat అంటే పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ మూవీలో ఛాన్స్ కొట్టేయడానికి మీనాక్షి ఈ కామెంట్స్ చేసింది అంటున్నారు సినీ జనాలు.

Published : 
  • 3 September 2024, 1:08 PM IST