బ్రేకింగ్: ఏపీకి అదాని 25 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యలకు గానూ... ప్రముఖ వ్యాపారవేత్త... గౌతం అదాని నేతృత్వంలోని అదానీ గ్రూప్ రూ 25 కోట్లు విరాళంగా ప్రకటించింది. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వరద భారీ నష్టం చేసిన సంగతి తెలిసిందే.

Post Published By: Vencateshg
Updated : 19 September 2024, 4:09 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యలకు గానూ... ప్రముఖ వ్యాపారవేత్త... గౌతం అదాని నేతృత్వంలోని అదానీ గ్రూప్ రూ 25 కోట్లు విరాళంగా ప్రకటించింది. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వరద భారీ నష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అన్ని వర్గాల నుంచి రాష్ట్రానికి భారీ సాయం అందుతోంది. ఇప్పటి వరకు 350 కోట్లకు పైగా సాయం అందినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

తాజాగా ఏపీకి 25 కోట్లు సాయం చేస్తున్నట్టు గౌతం అదాని ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కుండపోత వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన అపారమైన నష్టంతో తీవ్రంగా కలత చెందినట్టు పేర్కొన్నారు. అదానీ గ్రూప్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తోంది అన్నారు. సహాయానికి గానూ... 25 రూపాయలను అదాని ఫౌండేషన్ నుంచి అందిస్తామన్నారు.
https://x.com/gautam_adani/status/1836692426678763914

Published : 
  • 19 September 2024, 4:09 PM IST