Top story: చెల్లికి ఆపరేషన్ జరిగితే జగన్ ఎక్కడా..? వైఎస్ అభిమానుల తీవ్ర ఆగ్రహం జగన్ ‘అన్న’తనం ఇదేనా?

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ యమ యాక్టివ్‌గా ఉంటూ, అధికార పక్షంపై పదునైన విమర్శలు గుప్పించే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొన్ని రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు.

Post Published By: dialnews
Updated : 28 July 2026, 1:56 PM IST

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ యమ యాక్టివ్‌గా ఉంటూ, అధికార పక్షంపై పదునైన విమర్శలు గుప్పించే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొన్ని రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. ఆమె ఫోన్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అసలు షర్మిల ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగింది. అయితే తాజాగా అసలు విషయం బయటకు వచ్చి, అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. షర్మిల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, ఏకంగా సర్జరీ చేయించుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

కానీ, ఈ మొత్తం ఎపిసోడ్‌లో అందరినీ షాక్‌కు గురిచేస్తున్న విషయం ఏంటంటే.. తోడబుట్టిన చెల్లికి ఆపరేషన్ జరిగితే, ఆమె అన్న, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు స్పందించలేదు? కనీసం ఒక పరామర్శ లేదు, ఒక ట్వీట్ కూడా లేదు! అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోంది? జగన్ వైఖరిపై వైఎస్ అభిమానులు ఎందుకు మండిపడుతున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు మాట్లాడుకుందాం..

అసలు ఏం జరిగిందంటే.. గత కొన్ని రోజులుగా షర్మిల కడుపునొప్పితో తీవ్రంగా సతమతమయ్యారు. నొప్పి ఎక్కువ కావడంతో ఆమె ఉన్నపళంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా ఆమెకు ఆపరేషన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా షర్మిల సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఆ ఫొటోలో షర్మిల ఆసుపత్రి బెడ్‌పై అచేతనావస్థలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని, తన కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు అని ఆమె పేర్కొన్నారు.

ఈ పోస్ట్ చూసిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు, వేలాది మంది నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెట్టారు. అయితే, షర్మిల ఆరోగ్యం గురించి అంతా ఆందోళన చెందుతుంటే.. ఆమె సొంత అన్న జగన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. సాధారణంగా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే, అన్ని పనులూ పక్కనపెట్టి పలకరించడం మన సంస్కృతి. కానీ జగన్ నిత్యం రాజకీయ వ్యూహాల్లో మునిగితేలుతూ.. కనీసం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టలేదు. జగన్ అనుచరులు ఆయనను ఎప్పుడూ 'దయ, కరుణ, ఆప్యాయత కలిగిన నేత' అని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తూ ఉంటారు.

కానీ సొంత చెల్లికి ఆపరేషన్ జరిగితే పట్టించుకోని జగన్ లో ఆ గుణాలు ఎక్కడున్నాయని ఇప్పుడు వైఎస్ అభిమానులే బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. రాజకీయం కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. జగన్ కోసం గతంలో షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేసి, ‘జగనన్న వదిలిన బాణం’ అని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆస్తుల వివాదాలు, రాజకీయ విభేదాల వల్ల ఇద్దరి దారులూ వేరయ్యాయి. కానీ, రాజకీయాలు ఎంతగా విభేదించినా.. రక్తసంబంధం, తోడబుట్టిన బంధం వేరని ప్రజలు అనుకుంటారు.

ఇలాంటి అత్యవసర ఆపద సమయంలో కూడా చెల్లిని పరామర్శించకపోవడం నిజంగా దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. "సొంత చెల్లి బాగోగులే పట్టించుకోని జగన్.. ఇక రాష్ట్ర ప్రజల బాగోగులు ఏం పట్టించుకుంటారు?" అంటూ విపక్షాలు మరియు కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో చాలా బోల్డ్‌గా కామెంట్లు పెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కుటుంబ బంధాలకు ఆ కుటుంబం ఇచ్చే విలువను వైఎస్ అభిమానులు ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు జగన్ ప్రవర్తిస్తున్న తీరు ఆ అభిమానులనే తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇప్పుడైనా జగన్ తన రాజకీయ పంతాలను, ఆస్తుల గొడవలను పక్కనపెట్టి.. ఒక పెద్ద అన్నగా షర్మిలను పరామర్శించి తన ‘అన్న’తనాన్ని నిరూపించుకోవాలని, వైఎస్సార్ ఆత్మ శాంతించేలా ప్రవర్తించాలని సామాన్య జనం కోరుకుంటున్నారు.

Published : 
  • 28 July 2026, 1:56 PM IST