మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్‌ను ప్రకటించింది అధిష్టానం. కానీ ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఆ నియోజకవర్గానికి చెందిన PVG కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు. తమ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదు.. కానీ ప్రసాద్‌కి మాత్రం వద్దని టీడీపీ హైకమాండ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు.
