2029లో ఏపీలో టిడిపి ఓడిపోయే తొలి నియోజకవర్గం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. ఇది నేను చెప్తున్న మాట కాదు. టిడిపి అధిష్టానానికే ఇప్పటికే అర్థమైన విషయం. దీనికి ప్రధాన కారణం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా. ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన రోజు నుంచి ఈ మహిళ ఎమ్మెల్యే అరాచకాలతో కర్నూలు జిల్లాలోనే టిడిపి నీరు గారు పోతుంది. తన భర్త సహకారంతో భూమా అఖిల చేస్తున్న దందాలు, దాడులు భరించలేని స్థితికి వచ్చాయన్న విషయాన్ని టిడిపి అధిష్టానం గుర్తించింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో పాటు, పార్టీ నివేదికను కూడా సిద్ధం చేసుకుని అఖిల నీ త్రిసభ్య కమిటీ ముందుకు పిలిచింది. రెండేళ్ల కాలంలో అఖిల ప్రియ అరాచకాల జాబితా చూసి టిడిపి హై కమాండ్ షాక్ అయిపోయింది.
ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లి లో సోలార్ ప్లాంట్ కాంట్రాక్టు తీసుకున్న సీల్ కంపెనీ సిబ్బందిని భూమా అఖిల అనుచరులు పర్సెంటేజీ కోసం డిమాండ్ చేశారు. ఈవ్యవహారాన్ని కంపెనీ ప్రతినిధులు కేంద్రమంత్రి అమిత్ షా నోటీసుకి తీసుకువెళ్లారు. కఅమిత్ షా ఏపీ సీఎం కి స్వయంగా ఈ విషయం ఫోన్ చేసి చెప్పారు. , సీఎంవో వెంటనే అఖిల ప్రియకు వార్నింగ్ ఇవ్వడంతో.... ఆమె వెనక్కి తగ్గారు.
నంద్యాల జిల్లా. చాగలమర్రి చికెన్ వ్యాపారులు లైవ్ కోళ్లను ఆళ్లగడ్డలో కొనుగోలు చేస్తారు. లైవ్ కోళ్లను తన దగ్గరే కొనాలని అఖిల ప్రియ అనుచరురాలు రమీజాబీ బెదిరిస్తున్నారని వ్యాపారులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ వద్ద కోళ్లను కొనకపోతే , షాపులు మూయిస్తామని , కిలో చికెన్ పై 30 రూపాయలు అదనంగా ఇవ్వాలని రమిజాబి డిమాండ్ చేసినట్లు తేలింది. దీనిపై మీడియాలో అల్లరి అవడంతో అఖిలప్రియ అనుచరుగణం వెనక్కి తగ్గారు.
దొరనిపాడు మండలం అర్జునాపురం లో ఓ మహిళను పట్టపగలు ఎమ్మెల్యే భూమా అఖిల అనుచరులు కిడ్నాప్ నకు ప్రయత్నించారు. కత్తులతో బెదిరించారు. స్థానికులు అడ్డుకోవడంతో ఆ మహిళను వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎమ్మెల్యే అనుచరులు నిఖిల్, సంపత్ సహా 10 మందిపై కేసు నమోదు అయింది. నిఖిల్ ,సంపత్ ఎమ్మెల్యే అఖిల ప్రైవేట్ అంగరక్షకులుగా వ్యవహరిస్తున్నారు. రౌడీ షీటర్ కవ్వా సాయి హత్య కేసులో ఈ నిఖిల్ పేరు ప్రముఖంగా వినిపించింది . ఆళ్లగడ్డ లోశిల్పాలు తయారు చేసే ముడి రాయిని బయటి నుంచి తెచ్చుకోవాలంటే
శిల్పులు టన్ను కు ఇంత ఇవ్వాలని అఖిల ప్రియ వసూలు చేశారు. ఈ విషయం మీడియా లో రావడంతో వసూళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరించడంతో ఆళ్లగడ్డ రూరల్ పిఎస్ లో భూమా అఖిల అనుచరులు నరసింహారెడ్డి,, నిఖిల్, నల్ల గట్ల నాగరాజు, సాయి పై కేసు నమోదు అయింది.
ఆళ్లగడ్డలో టిడిపి నేత సింగం భరత్ రెడ్డి పై ఎమ్మెల్యే భూమా అఖిల అనుచరులు దాడి చేశారు. నాలుగు రోడ్ల సర్కిల్లో నిలబడి ఉండగా సింగం భరత్ రెడ్డి పై కర్రలతో దాడి చేశారు.ఎన్నికల ముందు వైసీపీ నుంచి బీజేపీ లోకి, బీజేపీ నుంచి టీడీపీ లోకి చేరిన సింగం భరత్ రెడ్డి పై పాత పగలతో అఖిలప్రియ ఈ దాడి చేయించినట్లు తెలిసింది.బీసీ లోన్లు శాంక్షన్ చేయించేందుకు రూ 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, చిరు వ్యాపారస్తుల దగ్గర మార్కెట్ రేట్ కి మించి అధిక వసూలు చేయడం ఇలా ఒకటి కాదు అఖిలప్రియ అనుచరుల అరాచకాలు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వెనుక అఖిల అనుచరులు ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యం. . ఆళ్లగడ్డలో ఓ సీనియర్ కంటి వైద్య నిపుణుణ్ణి 50 లక్షల కోసం బెదిరించారని సమాచారం. ఒక ప్రేమ జంట కేసులో ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ అధికారి పట్ల అఖిల అనుచరుడు నిఖిల్ ధౌర్జన్యానికి దిగారని, వైన్ షాపు నీ పర్మిట్ లేకుండా నడుపుతున్నారని ఆరోపణలపై నిఖిల్ ని స్టేషన్ కు తీసుకురాగా పోలీస్ అధికారినే అతను బెదిరించాడని సమాచారం.
అహోబిలంలో తలనీలాల టెండర్ల వ్యవహారంలో భూమా అఖిల అనుచరుడు గుంటూరు శ్రీను తమిళనాడు వ్యాపారిని ఫోన్ లో బెదిరించారు. అహోబిలం తలనీలాలు ఎలా కొంటావని బెదిరించారు. అహోబిలం టోల్ గేట్ వ్యవహారంలో భూమా అఖిల అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి ఆరోపించారు. ఆధారాలు చూపాలని భూమా అఖిల బహిరంగ చర్చకు సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గంగుల , అహోబిలం ఆలయ సీఎఓ పార్థసారథి కుమ్మక్కయ్యారని భూమా అఖిల ఆరోపించారు.
యాలూరు, ఆళ్ళగడ్డ, రుద్రవరం, చాగలమర్రి ఏరియాలో ఒక్కొక్క కేబుల్ కనెక్షన్ 30 రూపాయలు కమిషన్ ఇవ్వాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు కేబుల్ ఆపరేటర్లు. కమిషన్ ఇవ్వనందుకు కేబుల్ వైర్లు కట్ చేశారని కూడా వాళ్ళు లబోదిబోమన్నారు.ఈ వ్యవహారాలన్నిటి వెనక కేవలం అఖిలప్రియ మాత్రమే కాదు ఆమె భర్త హస్తం ఉందనేది నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదిస్తాం, భూమా పేరు వింటేనే జనం హడలిపోవాలి అన్న రేంజ్ లో అఖిలప్రియ నియోజకవర్గంలో జనాన్ని అడలెత్తిస్తున్నారు. అఖిల విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశామని టిడిపి హాయ్ కమాండ్ కు అర్థమైంది. ఆగమేఘాలపై పిలిపించి క్లాస్ పీకారు.