ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండ్ షో తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఓటమి

ప్రపంచ క్రికెట్ లో గత కొంతకాలంగా పలు జట్లకు షాకిస్తూ సంచలనాలు సృష్టిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఇటీవలే సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన ఆఫ్ఘన్ టీమ్ తాజాగా బంగ్లాదేశ్ ను నిలువరించింది.

Post Published By: Vencateshg
Updated : 7 November 2024, 3:35 PM IST

ప్రపంచ క్రికెట్ లో గత కొంతకాలంగా పలు జట్లకు షాకిస్తూ సంచలనాలు సృష్టిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఇటీవలే సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన ఆఫ్ఘన్ టీమ్ తాజాగా బంగ్లాదేశ్ ను నిలువరించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ లో అఫ్గానిస్తాన్‌ 92 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ , కెప్టెన్ హష్మతుల్లా హాఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత బంగ్లా స్పిన్నర్ ఘజన్ ఫర్ ధాటికి బంగ్లాదేశ్‌ 34.3 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. ఘజన్‌ఫర్‌ 26 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం ద్వారా బంగ్లా పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Published : 
  • 7 November 2024, 3:35 PM IST