మాధవీలతను గెలిపించేందుకు ఢిల్లీ నుంచి పెద్దలు దిగివస్తున్నారు. పాతబస్తీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసి.. ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని మాధవీలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ చుట్టేస్తున్న ఆమె.. నామినేషన్ దాఖలు చేశారు.
