బ్రేకింగ్: మళ్ళీ మొదలైన వరద…?

బుడమేరుకు వరద ప్రవాహం మళ్ళీ పెరిగింది. వైయస్సార్ కాలనీ రోడ్లో ఉదృతంగా బుడమేరు ప్రవహిస్తున్నది. జక్కంపూడి , వైయస్ఆర్ కాలనీ , పైపుల్ రోడ్డు ప్రాంతంలోని నివాసాలు జలదిగ్బంధం అయ్యాయి. గంట గంటకు బుడమేరు వరద పెరగడంతో స్థానికుల్లో మళ్ళీ భయం మొదలయింది.

Post Published By: Vencateshg
Updated : 5 September 2024, 3:02 PM IST

బుడమేరుకు వరద ప్రవాహం మళ్ళీ పెరిగింది. వైయస్సార్ కాలనీ రోడ్లో ఉదృతంగా బుడమేరు ప్రవహిస్తున్నది. జక్కంపూడి , వైయస్ఆర్ కాలనీ , పైపుల్ రోడ్డు ప్రాంతంలోని నివాసాలు జలదిగ్బంధం అయ్యాయి. గంట గంటకు బుడమేరు వరద పెరగడంతో స్థానికుల్లో మళ్ళీ భయం మొదలయింది. డ్రోన్ విజువల్స్ లో బాదితుల ఆవేదన స్పష్టంగా కనపడుతోంది. వరదలో చిక్కుకొని మూడు రొజులుగా భోజనం లేదంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు అందాల్సిన సహాయ కార్యక్రమాలను చంద్రబాబు పర్యవేక్షించారు. అటు మైలవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరద మళ్ళీ పెరిగింది. దీనితో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పలు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Published : 
  • 5 September 2024, 3:02 PM IST