Pawan Kalyan : సినిమాలకు దూరంగా పవన్ కళ్యాణ్

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే పలు కీలక మంత్రిత్వ శాఖలు ఆయన వద్ద ఉన్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 July 2024, 10:10 AM IST

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే పలు కీలక మంత్రిత్వ శాఖలు ఆయన వద్ద ఉన్నాయి. దీంతో ఇప్పట్లో పవన్ సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆయన అభిమానులు మాత్రం సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా చిత్రీకరణ దశలో ఉన్న 'ఓజీ' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న.. తన బాధ్యతను గుర్తు చేస్తూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.

తాజాగా ఉప్పాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా.. అభిమానులు పెద్ద ఎత్తున ఓజీ.. ఓజీ అంటూ నినాదాలు చేశారు. అది విన్న పవన్ భలే సమాధానమిచ్చారు. సినిమాలు చేసే టైం ఉందంటారా. ఇప్పుడు మనం ఓజీ అంటే.. ప్రజలు క్యాజీ అంటారు. మూడు నెలలపాటు షూటింగ్‌ కు దూరంగా ఉంటాను. మా నిర్మాతలకు కూడా ఇదే చెప్పాను. నన్ను క్షమించాలి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనీస సేవ చేసుకొని.. ఓ మూడు నెలల తర్వాత కుదిరినప్పుడు రెండు-మూడు రోజులు షూటింగ్ కి కేటాయిస్తాను అని చెప్పాను. అని అన్నారు.

ఇక చివరిలో ఓజీ చూద్దురు గాని.. బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు. ఎలక్షన్స్ లో గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తం అయ్యాయి. దానికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చిన సమాధానంతో ఆయన అభిమానులందరూ ఖుషి గా ఫీల్ అవుతున్నారు. ఇక తొందర్లోనే ఆయన సినిమా షూటింగ్ ల్లో కూడా పాల్గొని సెట్స్ మీద ఉన్న సినిమాలను తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇక మీదట రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది

Published : 
  • 4 July 2024, 10:10 AM IST