హైదరాబాద్ నగర నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాగా ఈ ఘటన సమయంలో అందులో నివసిస్తున్న కొంత మంది ప్రాణ భయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Fire accident in Panjagutta Erramanzil..