ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అంటే గత దశాబ్ద కాలంగా మనకు గుర్తొచ్చే కొన్ని పేర్లలో చటేశ్వర పుజారా ఒకటి… ద్రావిడ్ తర్వాత టెస్ట్ జట్టులో ఆ స్థానంలో ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా మారిన బ్యాటర్ పుజారానే… క్రీజులో పాతుకుపోయాడంటే ప్రత్యర్థి బౌలర్లు తలపట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
