రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సొంగా శేఖర్ కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన మహిళ కావడంతో ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించింది.
