మళ్ళీ అదే ఓల్డ్ స్టోరీ, సిడ్నీలోనూ భారత్ ఫ్లాప్ షో
ఆస్ట్రేలియా టూర్ లో భారత బ్యాటర్ల ఆటతీరు ఏం మారలేదు. సిరీస్ చేయాలంటే బాగా ఆడాల్సిన చివరి టెస్టులోనూ మన బ్యాటర్లు చేతులెత్తేశారు. పాత కథనే రిపీట్ చేస్తూ తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బ్యాటర్ల ఫ్లాప్ షోతో టీమిండియా 185 పరుగులకే ఆలౌటైంది.