ఎంతో ప్రతిభ ఉన్న క్రికెటర్… బీసీసీఐ అతనికి అన్యాయం చేస్తోంది… దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.. ఇదీ కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ కెరీర్ తొలినాళ్ళలో అభిమానుల ఆవేదనతో కలిపిన ఆగ్రహం… క్రమంగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి… కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సంజూ విఫలమయ్యాడు.