Sharath Babu: మరో చరిత్రగా నిలిచిపోయిన శరత్ బాబు సినీ ప్రస్తానం..

శరత్‌బాబు తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో చనిపోయారని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు ఆయన చెల్లెలు ఈ వార్తలను ఖండించారు. నెలరోజులకు పైగా ఏఐజీ హాస్పిటల్‌లో శరత్ బాబుకి చికిత్స అందించారు వైద్యులు. ఈరోజు ఉదయం నుంచి శరత్ బాబు ఆరోగ్యం మరింత క్షీణించింది. అప్పటికే అనేక పరీక్షలు జరిపిన వైద్యబృందం శరత్ బాబు కుటుంబ సభ్యులకు ఆయన మరణించినట్లు తెలిపారు. దీంతో ప్రముఖ నటుడు ఇకలేరనే వార్తను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం మీడియాకు చెప్పారు.

Post Published By: Srikar Creator
Updated : 22 May 2023, 6:37 PM IST

Published : 
  • 22 May 2023, 6:37 PM IST

Exit mobile version