ఏపీ వైపుగా తుఫాన్ ముప్పు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పుదుచ్చేరికి 730 కిలోమీటర్లు, చెన్నైకి 740 కిలోమీటర్లు, నెల్లూరుకు 860 కిలోమీటర్లు, బాపట్లకు 930 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. శనివారానికి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా.. ఆదివారానికి తుఫాన్‌గా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నా్. ఈ తుఫాన్‌కు మిచౌంగ్ అని పేరు పెట్టారు.

Typhoon threat to AP.. Flood from tomorrow..