Michoung Cyclone : ఆంధ్రప్రదేశ్ కు మిచౌంగ్ తుఫాన్ హెచ్చరిక.. రెండు మూడు రోజులు భారీ వర్షాలు..
ఇక సముద్ర తీరం వెంబడి.. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశంముందని.. ఈ నెల 4న సాయంత్రానికి చెన్నై-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ లో 1077 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.