(యూకే) బ్రిటన్‌కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్ అనే వ్యక్తి తన కూతురు పేరు ను ఒంటిపై 667 సార్లు పచ్చబొట్టుగా వేయించుకొని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నాడు. 49 ఏళ్ల వయసున్న మార్క్ ఓవెన్ ఎవాన్స్ ఒకే పేరును తన శరీరంపై ఎక్కువసార్లు టాటూస్ రూపంలో వేయించుకుని ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డు కొల్లగొట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఓవెన్ ఎవాన్స్ తన గిన్నిస్ రికార్డును తనే మరల బ్రేక్ చేశాడు అంటే నమ్ముతారా.. అవును తన గిన్నిస్ బుక్ రికార్డును తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తిగా కూడా నిలిచాడు ఓవెన్ ఎవాన్స్.

UK A man named Mark Owen Evans from Britain has humbly expressed his love by tattooing his daughters name 667 times on his back