నా మొగుడు లేకుంటే ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తాగుబోతోడు దేని కింద అయినా పడి చావడా? వాడు ఎప్పుడు పోతాడు? అవును వాడు చచ్చాక నువ్వు ఉండగలవా అక్కడ...? నేను నెల రోజులు కూడా ఇక్కడ ఉండలేను. నెల మాసికం అయినాక వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తా...నల్గొండ జిల్లాలో ఓ పెళ్లి అయిన మహిళ... ఇద్దరు పిల్లల తల్లి, వీడియో కాల్ లో తన ప్రియుడితో మాట్లాడిన మాటలు ఇవి. ఈ మాటలు వింటుంటే మీకు ఆశ్చర్యం... జుగుప్సా కలగక మానదు.తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలు ఎన్ని దారుణాలకు దారితీస్తున్నాయో తెలిపే సంఘటన ఇది. తన భార్య తనని, తన పిల్లలని చంపడానికి ప్రయత్నిస్తుందంటూ... సూర్యాపేట పోలీస్ స్టేషన్లో సతీష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన సందర్భంలో బయటపడిన వీడియోలు... ఫోటోలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారి తీసాయి.
నాగార్జునసాగర్ లో ఒక ఛానల్ రిపోర్టర్ గా పని చేసే వెంకటరెడ్డి అనే వ్యక్తి స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇతగాడి మొదటి ఇద్దరు భార్యలు వెళ్లిపోయారు. సొంత ఊర్లోఉండే మరో ఇద్దరు పిల్లల తల్లిని తగులుకున్నాడు వెంకటరెడ్డి. చాన్నాళ్లుగా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది.ఏదో కారణంతో తరచూ అతని దగ్గరికి వెళ్లడం, తన పిల్లలను కూడా తీసుకొని వెళ్లడం... రెండు మూడు రోజులు ఎంజాయ్ చేసి తిరిగి భర్త దగ్గరికి చేరడం ఆమెకు అలవాటు అయిపోయింది . భర్త సతీష్ ను చంపేస్తే గాని శాశ్వతంగా అతని దగ్గర ఉండలేనని... భర్త ఏదో ఒక రోజు చస్తే .... ఫ్యూచర్ లైఫ్ అంతా ఎంజాయ్ చేద్దామని వెంకట్ రెడ్డితో ఆమె మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు బయటపడింది.
ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ వివాహిత ,రిపోర్టర్ వెంకట రెడ్డి దగ్గరికి వెళ్లిపోయింది. వెంకటరెడ్డి ప్రవర్తన నచ్చక ఆమె కూతురు మళ్ళీ వెనక్కి తండ్రి దగ్గరకు వచ్చేసింది. కొద్దిరోజుల తర్వాత పిల్లవాడు కూడా తండ్రి సతీష్ దగ్గరికే వచ్చేసాడు. పిల్లలు ఇద్దరు నీ వెంటపెట్టుకొని సతీష్ సూర్యాపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాను సంపాదించిన ఫోన్ వీడియో కాల్ రికార్డ్స్ అన్ని పోలీసులకి చూపించాడు. తన భార్య ఖచ్చితంగా తనను హత్య చేయిస్తుందని.... కనుక తనకి రక్షణ ఇమ్మని కోరాడు.
అంతకుముందే గ్రామ పెద్దలతో ఒక చిన్న సైజు పంచాయతీ కూడా జరిగింది. ఈ ఫోటోలు ఫోన్ కాల్ రికార్డ్స్ అన్ని వాళ్లకు కూడా చూపించాడు సతీష్. అయితే రిపోర్టర్ వెంకటరెడ్డి తన పరపతిని ఉపయోగించి గ్రామ పెద్దలపై కూడా కేసు పెట్టించినట్లు తెలిసింది. తన కుమార్తెతో కూడా వెంకటరెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని సతీష్ చెప్తున్నాడు. అక్రమ సంబంధానికి అలవాటు పడిన ఒక భార్య తన ప్రియుడితో ఇంత నిర్లజ్జగా.. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడడం... మొగుడు చచ్చాక ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేయడం వింటుంటే మొబైల్ ఫోన్ల పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో. సంసారాలు ఎలా దారి తప్పయో అర్థం అవుతుంది.