హైదరాబాద్ ను మిస్ అవుతున్నా వార్నర్ ఎమోషనల్ పోస్ట్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు భారత్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహించిన వార్నర్ జట్టును ఛాంపియన్ గా కూడా నిలిపాడు.

Post Published By: Vencateshg
Updated : 28 August 2024, 5:57 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు భారత్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహించిన వార్నర్ జట్టును ఛాంపియన్ గా కూడా నిలిపాడు. సన్ రైజర్స్ కు ఆడుతున్నప్పటి నుంచీ ఇక్కడి ఫ్యాన్స్ తో బాగా రిలేషన్ పెంచుకున్నాడు. టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ డైలాగ్స్ చెప్పడం, వారి పాటలకు డాన్స్ చేస్తూ రీల్స్ చేయడం వంటి వాటితో ఇక్కడి క్రికెట్ ఫ్యాన్స్ కు బాగా దగ్గరయ్యాడు. తాజాగా హైదరాబాద్ పై తనకున్న ఇష్టాన్ని వార్నర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన సిటీ హైదరాబాద్ ను మిస్ అవుతున్నా అంటూ చార్మినార్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

Published : 
  • 28 August 2024, 5:57 PM IST

Topics :