క్రికెట్ లో రనౌట్ అంటే బ్యాటర్ తప్పిదమే ఎక్కువగా ఉంటుంది. తాజాగా ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ చేజేతులా తన వికెట్ తానే ఇచ్చుకున్నాడు. ఇప్పటికే పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లీ.. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.