పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో ఉదయం ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్దమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు అర్థరాత్రి బండి సంజయ్ ని ముందస్తు అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
బండి సంజయ్ ని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు
బీజేపీ శ్రేణులు నిలువరించే ప్రయత్నం చేశారు
పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది
పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు
బండి సంజయ్ ని ఎత్తుకు పోతున్న చిత్రం
అరెస్ట్ కు నిరాకరించి క్రింద బైఠాయించారు
పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ శ్రేణులు
పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వ్యక్తి సంజయ్ కి వాట్సప్ లో పంపించారు.
దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించారు.
ప్రెస్ మీట్ పెడితే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయన్న నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ కు సిద్దం అయిన పోలీసులు
అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో అరెస్ట్ చేసేందుకు ప్రణాళికలు రచించారు.