గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గోల్కొండలో తెలంగాణ ఆవిర్భావదినోత్సవ ఏర్పాట్లు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన బీజేపీ ఎంపీ
సైనిక గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న సికింద్రాబాద్ ఎంపీ
హాజరైన బీజేపీ పార్టీ ప్రముఖ నాయకులు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పాటలు పాడి అలరించిన గాయని మధుప్రియ
తెలంగాణ ఆవిర్భావం గురించి కిషన్ రెడ్డి ప్రసంగం
అందరినీ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కాళోజీ పెయింటింగ్.