ఒక మనిషిని చంపాలంటే కత్తితో పొడవక్కర్లేదు, తుపాకీతో కాల్చక్కర్లేదు.. వాళ్ల మెదడును మన ఆధీనంలోకి తీసుకుంటే చాలు, వాళ్లే వెళ్లి నదిలో దూకేస్తారు. సైకాలజీలో దీనిని 'కోయర్సివ్ కంట్రోల్' లేదా 'మైండ్ హైజాకింగ్' అంటారు. సరిగ్గా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం విషయంలో ఇదే జరిగింది. సమాజంలో క్లాస్-1 హోదా ఉన్న ఒక గెజిటెడ్ ఆఫీసర్, చదువుకున్న ఆయన కూతురు, కుటుంబం మొత్తం ఒక రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ చేతిలో ఎలా బందీ అయ్యారు..? ఈ కేసు కేవలం ఆత్మహత్య ప్రేరణ కాదు.. దీని వెనుక ఒక పక్కా ప్లాన్డ్ ఫైనాన్షియల్ అండ్ సైకలాజికల్ టెర్రర్ దాగుంది.
మొదటి మరియు అత్యంత కీలకమైన ప్రశ్న.. ఏఈ నూకరాజు లాంటి ఒక ఉన్నతాధికారి పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదు..? ఇక్కడే మనం సాదిక్ ఖాన్ సాగించిన 'డిజిటల్ టెర్రరిజం' గురించి మాట్లాడుకోవాలి. సౌజన్య రాసిన లేఖల ప్రకారం.. సాదిక్ ఆమె ఫోన్‌ను పూర్తిగా ట్రాప్ చేశాడు. అంటే.. ఆ ఇంట్లో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చాటింగ్ చేస్తున్నారు, పోలీసులకు సమాచారం ఇస్తున్నారా లేదా అనేది సాదిక్ తన ఫోన్ లోనే కూర్చుని లైవ్‌గా ట్రాక్ చేసేవాడు. "మీరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే.. మీ మనవడు కార్తికేయరెడ్డి శవం డ్రైనేజీలో తేలుతుంది" అని బెదిరించాడు. ఒక ప్రభుత్వ అధికారి కంటే, ఒక తాతగా నూకరాజు తన మనవడి ప్రాణం కోసం భయపడ్డాడు. సాదిక్ సృష్టించిన ఆ డిజిటల్ జైలు నుండి బయటపడలేక, పోలీసులకు చెబితే ఎక్కడ తన కుటుంబం రోడ్డున పడుతుందోననే 'సామాజిక భయం' వారిని నిర్వీర్యం చేసింది.
రెండో మరియు మూడో ప్రశ్న.. ఏఈ కుమార్తెపై చేయి చేసుకునే ధైర్యం సాదిక్‌కు ఎలా వచ్చింది..? కేవలం షూటింగ్ కోచ్‌గా వచ్చిన వాడు కుటుంబాన్ని ఎలా లొంగదీసుకున్నాడు..? ఇది ఒక రోజులో జరిగింది కాదు. సాదిక్ ఒక పక్కా 'సెక్టారియన్ ప్రిడేటర్'. మొదట నూకరాజు మనవడికి కోచ్‌గా చేరి, ఆ ఇంట్లో ఉన్న బలహీనతలను గమనించాడు. నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మరియు కుమార్తె సౌజన్యల మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్థలను లేదా సౌజన్యకు సంబంధించిన కొన్ని 'ప్రైవేట్ విషయాలను' సాదిక్ దొంగతనంగా సేకరించాడు. ఆ ప్రైవేట్ డేటాను వాడుకుని బ్లాక్‌మెయిలింగ్ స్టార్ట్ చేశాడు. సమాజంలో గౌరవంగా బతికే కుటుంబం కాబట్టి, ఆ విషయాలు బయటకు వస్తే తట్టుకోలేరని సాదిక్‌కు తెలుసు.
అందుకే మెల్లమెల్లగా బెదిరిస్తూ.. ఆ ఇంటి ఏటీఎం కార్డులు, ఎస్బీఐ లాకర్ కీస్, నూకరాజు ఆస్తి పత్రాలు అన్నింటినీ తన వశం చేసుకున్నాడు. అంటే ఆ ఇంట్లో వాళ్లు బందీలుగా బతికారు, సంపాదన అంతా సాదిక్ అకౌంట్‌కి వెళ్ళిపోయింది. ఇక ఈ కేసులో లీగల్‌గా అత్యంత భయంకరమైన కోణం.. నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మరణం. ఆయన గత నెల జూలై 2వ తేదీన చనిపోయారు. అప్పట్లో గుండెపోటు అనుకున్నారు. కానీ సౌజన్య లేఖలో రాసిన ముక్క చదివితే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. "నా భర్త జగదీష్ రెడ్డికి సాదిక్ ఏదో మందు ఇచ్చి చంపేశాడు" అని ఆమె రాసింది.
ఇక్కడ నాలుగు, ఐదు, ఆరో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. సాదిక్ ఏఈ అల్లుడిని 'స్లో పాయిజన్' ఇచ్చి హత్య చేశాడా..? ఒకవేళ అదే నిజమైతే, జూలైలోనే ఆ విషయాన్ని నూకరాజు కుటుంబం ఎందుకు దాచింది..? ఎందుకంటే.. జగదీష్ రెడ్డిని చంపిన తర్వాత సాదిక్ ఆ కుటుంబాన్ని మరింత తీవ్రంగా బెదిరించాడు. "మీ అల్లుడిని ఎలా చంపానో చూశారుగా.. నోరెత్తితే మీ మనవడిని, మిమ్మల్ని కూడా ఇలాగే లేపేస్తా" అని నూకరాజును బ్లాక్మెయిల్ చేశాడు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న సౌజన్యను, కొడుకును కాపాడుకోవాలనే భయంలో ఉన్న నూకరాజును సాదిక్ పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు.
జగదీష్ రెడ్డి బ్రతికున్నప్పుడే సాదిక్ ప్రమేయం పెరిగిపోవడంతో, దాన్ని జగదీష్ రెడ్డి వ్యతిరేకించాడని, అందుకే అతడిని సాదిక్ కొట్టి, ఆ తర్వాత విషమిచ్చి చంపేశాడని ఇప్పుడు జగదీష్ తండ్రి భాస్కర్‌రెడ్డి పెట్టిన కేసులో స్పష్టంగా ఉంది. ఏడు, ఎనిమిది, తొమ్మిదో ప్రశ్నలు.. కేవలం డబ్బుల కోసమే అయితే సాదిక్ ఆ అమ్మాయి చేత ముస్లిం మత ఆచారాలు ఎందుకు పాటించేలా చేశాడు..? రోజూ ఇస్లాం పుస్తకాలు ఎందుకు రాయించాడు..? ఇక్కడే ఈ కేసు 'లవ్ జిహాద్' లేదా 'ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ మాఫియా' వైపు మళ్లుతోంది.
హిందూ సమాజంలో ఉన్నత హోదాలో ఉన్న కుటుంబాల ఆస్తులను టార్గెట్ చేయడం, ఆ ఇంట్లోని ఆడవారిని బ్లాక్మెయిల్ చేసి మతం మార్చడం, ఆపై ఆస్తులన్నీ తమ ట్రస్టులకో లేదా తమ నెట్వర్క్కో బదిలీ చేయించుకోవడం అనే ఒక పెద్ద వ్యవస్థీకృత నేరం ఇందులో దాగుందా అనే సందేహాలు వస్తున్నాయి. ఏఈ నూకరాజు సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తిని లీగల్‌గా తన పేరు మీదకు మార్పించుకోవడానికే సౌజన్యను మతం మార్చాలని సాదిక్ ఒత్తిడి తెచ్చాడు. భర్త చనిపోకముందు నుండే సాదిక్ పరిచయం ఉండటం, భర్త చనిపోయాక ఆమె ఒంటరితనాన్ని, భయాన్ని వాడుకుని సాదిక్ ఈ రాక్షస క్రీడ ఆడాడు.
ప్రస్తుతం సర్పవరం పోలీసులు క్రైం నంబర్ 260/2026 కింద సాదిక్ ఖాన్‌పై హత్య, ఆత్మహత్య ప్రేరణ, కిడ్నాప్ లాంటి కఠినమైన కొత్త చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గోదావరిలో గల్లంతైన మీనా, సౌజన్యల మృతదేహాల కోసం డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. ఈ కేసులో కేవలం సాదిక్ మాత్రమే ఉన్నాడా, లేదా నూకరాజు కారు డ్రైవర్ లాంటి అంతర్గత వ్యక్తులు ఎవరైనా సహకరించారా అనేది తేలాల్సి ఉంది. సాదిక్ దొరికి, సౌజన్య మొబైల్ ఫోన్ యొక్క ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే ఈ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన మిస్టరీకి ఎండ్ కార్డ్ పడుతుంది.