ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఆఫర్స్ సీజన్ నడుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంత సంచలన సృష్టించాయో ఆ తర్వాత వరుసగా జరుగుతున్న సంఘటనలు అంతే సంచలనం సృష్టిస్తున్నాయి. నాకు ఆఫర్ వచ్చిందని ఓ ఎమ్మెల్యే చెప్తే నాకు కూడా వచ్చిందని మరో ఎమ్మెల్యే ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇలా రోజుకొకరు బయటికి వస్తున్నారు. రాపాక వరప్రసాద్ ,మద్దాలి గిరి , ఆర్డర్ ఇంకా ఎంతమంది ఉన్నారు ?ఇంకా ఎంతమందికి ఫోన్ల వచ్చాయో మరి?…ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో రోజు బయటకు వచ్చి నాకు ఫోన్ వచింది.. నన్ను అడిగారు.. నాకు కోట్లు ఆఫర్ చేశారని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఆఫర్ చేసిన వాళ్ళైనా చెప్పాలి .లేదా ప్రభుత్వం అయినా దర్యాఫ్తు చేసి తేల్చాలి.

AP MLC Politics