బ్రేకింగ్: ఒంగోలులో మెగా ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి... జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. దీనితో ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు అభిమానులు. అయితే ఇది కాస్త వివాదం అయింది.

Post Published By: Vencateshg
Updated : 21 September 2024, 12:25 PM IST

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి... జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. దీనితో ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు అభిమానులు. అయితే ఇది కాస్త వివాదం అయింది. ఒంగోలు చర్చి సెంటర్ లో బాలినేని ఫ్లెక్సీలు తొలగించారు టిడిపి నేతలు. ఈ రోజు ఉదయం బాలినేని జనసేన లోకి రాకను స్వాగతించిన మెగా ఫాన్స్.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు.

అదే ఫ్లెక్సీ లో బాలినేని, టీడీపీ ఎమ్మెల్యే దామాచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట ఫోటో ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దామాచర్ల ఫోటో ను ఫ్లెక్సీ లో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించిన టీడీపీ శ్రేణులు... తొలగించిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది అప్పగించారు.

Published : 
  • 21 September 2024, 12:25 PM IST