జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయోత్సవ యాత్ర ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకముందే రాజకీయ వేడి రగిలింది. పవన్‌ను అడ్డుకోవడానికి అధికార వైసీపీ పోలీసులను అడ్డుపెట్టుకుంటోంది. మమ్మల్ని ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ జనసైనికులు సవాల్ చేస్తున్నారు. దీంతో విశాఖలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
