Biden Vs Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సీక్వెల్… బైడెన్ వర్సెస్ ట్రంప్ 2.0లో గెలుపెవరిది ?
బైడెన్, ట్రంప్ మళ్లీ పోటీచేస్తుండటంతో వాళ్ల పాలనా విధానాలను ఇప్పటికే చూసిన సగటు అమెరికన్లు… వీళ్లిద్దరికీ ప్రత్యామ్నాయం ఎవరైనా ఉంటే బాగుండని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితుల్లో కొత్త తరానికి అవకాశం రావాలని కోరుకుంటున్నారు.