టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పక్క చూపులు చూస్తుండటంతో కేసీఆర్‌లో రోజు రోజుకూ టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఖమ్మం జిల్లా మీద దాదాపు ఆశలు వదులుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ. ఇప్పుడు మరో కీలక నేత మైనంపల్లి హనుమంతరావు కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు.
