కర్ణాటక ఫలితాలు.. పక్క రాష్ట్రంలోనూ రాజకీయాలను షేక్ చేస్తున్నాయ్. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఆ రిజల్ట్ తాలుకూ మార్పులు కనిపిస్తున్నాయ్. ఆంధ్రప్రదేశ్ సంగతి ఎలా ఉన్నా.. 20రోజుల వ్యవధిలో కేసీఆర్ రెండోసారి బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ముందస్తు ఉండదని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చాలాసార్లు చెప్పారు కేసీఆర్. అలాంటిది ఇప్పుడు ఇంత అత్యవసరంగా మీటింగ్ ఎందుకు. అదీ 20రోజుల వ్యవధిలో ఎందుకు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

CM kcr political meeting at brs Bhavan