MAHARASTRA CM KCR: నాందేడ్ కు బయలుదేరిన కేసీఆర్ – గులాబీ వర్ణశోభితంగా రహదారులు
బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి వెళ్లే దారులన్నీ గులాబీ మయమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి సభావేది వరకు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ హోర్డింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గులాబీ తోరణాలను ఏర్పాటు చేశారు. […]