బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన షకీల్ ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్ తల్లి నిన్న చనిపోయారు. అచన్‌పల్లిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు కుటుంబ సభ్యులు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకీల్ హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మాత్రం అనుమతినిచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ […]
