కొడాలి నానీ ట్రాప్ లో జగన్, అందుకే అలా…!

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. వైయస్ఆర్ పార్టీలో ఏదో ఒక పార్టీ నుంచి చేరిన వారే అని కొడాలి ట్రాప్ లో పడి వైసిపి నన్ను ఇబ్బంది పెట్టిందని... పెనమలూరు 2014లో వైసీపీలో సీటు అడిగా ..ఇవ్వలేదు అన్నారు.

Post Published By: Vencateshg
Updated : 21 September 2024, 1:22 PM IST

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. వైయస్ఆర్ పార్టీలో ఏదో ఒక పార్టీ నుంచి చేరిన వారే అని కొడాలి ట్రాప్ లో పడి వైసిపి నన్ను ఇబ్బంది పెట్టిందని... పెనమలూరు 2014లో వైసీపీలో సీటు అడిగా ..ఇవ్వలేదు అన్నారు. 2019లో గన్నవరం లో జగన్ బ్రతిమ లాడితే పోటీ చేశా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేడీసిసి బ్యాంక్ చైర్మన్ పదవి ఇస్తే సమర్ధ వంతంగా పని చేసి 43 శాతం గ్రోత్ రేట్ చూపించా అన్నారు. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల బారిన రైతులు పడకుండా చూసినట్టు వెల్లడించారు.

కానీ కొడాలి ట్రాప్ లో పడి 13 నెలల్లో జగన్ తొలగించారు అని మండిపడ్డారు. గన్నవరం లో ఓ రాక్షసుడు పై పోటీ చేశా అని... టిడిపి లో అనేక మందితో టచ్ లో ఉన్న వ్యక్తిపై పోటీ చేసి గెలిచా అంటూ వ్యాఖ్యలు చేసారు. టిడిపి లో నేను చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని 3 సార్లు యాగాలు చేశా అని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పగను నేను మోసా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానానికి ప్రజలు టిడిపి తరపున పోటీ చేసిన నేను గెలిచా అని పేర్కొన్నారు. గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా అని స్పష్టం చేసారు. కెడిసిసి గత ఐదేళ్ల కాలంలో జరిగిన పాలన, అభివృద్ధి పై మంత్రి లోకేష్ ను వివరణ కోరా అన్నారు.

Published : 
  • 21 September 2024, 1:22 PM IST