బ్రేకింగ్:మంటల్లో లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌

పొడిచేస్తాం పీకేస్తాం అంటూ భారత్‌ మీద ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్‌కు తగిన శాస్తి జరిగింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ల ఆర్మీ విమానం ప్రమాదానికి గురైంది.

  • Written By:
  • Publish Date - April 26, 2025 / 07:56 PM IST

పొడిచేస్తాం పీకేస్తాం అంటూ భారత్‌ మీద ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్‌కు తగిన శాస్తి జరిగింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ల ఆర్మీ విమానం ప్రమాదానికి గురైంది. భారత్‌ చేపట్టిన ఎయిర్‌ఫోర్స్‌ విన్యాసాలకు బదులుగా పాకిస్థాన్‌ కూడా వాయు విన్యాసాలు చేసింది. ఆర్మీ విమానం విన్యాసాలు పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది.

ల్యాండ్‌ అవుతున్న సమయంలో విమానం టైర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నవాళ్లంతా భయంతో పరుగులు తీశారు. చిన్న నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్న చందంగా భారత్‌ను చూసి తాను కూడా విన్యాసాలు చేయాలనుకున్న పాక్‌కు తగిన శాస్తి జరిగింది. ఉన్నవే తక్కువ విమానాలు అంటే దిక్కుమాలిన పొగరుతో ఓ విమానాన్ని కోల్పోయింది పాకిస్తాన్‌.