కాకినాడ జిల్లా.. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లుగా తెలుస్తోంది.
పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని అక్కడి స్థానికులు అంటున్నారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఘటన విషయం తెలిసిన వెంటనే సిఎం చంద్రబాబు హోం మంత్రి అనితను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఇక బాధితులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.