పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆయనను లోక్‌సభ ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ సూచించిందని సమాచారం. అంతేకాదు.. ఎంపీగా పోటీ చేసి గెలిస్తే, రాబోయే బీజేపీ (ఎన్డీయే) ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
