బ్రేకింగ్‌: పవన్‌ కొడుకు ఎలా ఐపోయాడో చూడండి… హాస్పిటల్ నుంచి ఫొటోలు రిలీజ్‌

డిప్యుటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ అగ్ని ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి జనరల్‌ వార్డ్‌కు శంకర్‌ను మార్చారు డాక్టర్లు.

  • Written By:
  • Publish Date - April 9, 2025 / 05:58 PM IST

డిప్యుటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ అగ్ని ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి జనరల్‌ వార్డ్‌కు శంకర్‌ను మార్చారు డాక్టర్లు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలకు కట్లు కట్టారు. దట్టమైన పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో మార్క్‌ శంకర్‌ ఇబ్బంది పడుతున్నాడు.

దీంతో ప్రస్తుతం మాస్క్‌ ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ప్రస్తుతం శంకర్‌ పరిస్థితి మెరుగ్గానే ఉందంటున్నారు డాక్టర్లు. కొడుకును కలుసుకునేందుకు డిప్యుటీ సీఎం పవన్‌ ఇప్పటికే సింగపూర్‌కు వెళ్లారు. పవన్‌తో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ కూడా సింగపూర్‌కు వెళ్లారు. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే భార్యా పిల్లలతో పవన్‌ హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది.