ప్రస్తుతం బీజేపీలో ఉన్న విజయశాంతికి.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. చాలాకాలంగా ఆమె పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. మరోవైపు స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ రాములమ్మ పేరు లేకపోవడం కొత్త చర్చకు దారి తీసింది.
