కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా… ఇప్పటి వరకు సభలో మణిపూర్‌పై చర్చే జరగలేదు. కాలం గడిచే కొద్దీ.. అన్ని పార్టీలకు మణిపూర్ కూడా ఎన్నికల అంశంగా మారిపోతుంది. ఎవరి ప్రయోజనాలు వాళ్లు కాపాడుకునే బిజీలో ఉంటారు. మణిపూర్ మాత్రం నగ్నంగా రోధిస్తూనే ఉంటుంది.
