అవును అతనికి 60 ఏళ్లు. ఆమెకి 20 నుంచి 25 ఏళ్ళు. భార్యాభర్తలు కాదు. జస్ట్ సెక్సువల్ పార్ట్నర్స్.
రొమాంటిక్ లవర్స్. లేనిపోని ఎమోషన్స్ ఏమి వాళ్ళ మధ్య ఉండవు . అతనికి సుఖం కావాలి. ఆమెకు డబ్బు కావాలి. ఈ రకమైన సంబంధాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. వీటిని షుగర్ డాడీ, షుగర్ మామీ కల్చర్ అని అంటారు. షుగర్ డాడీ ,షుగర్ మామి కల్చర్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాదులో బాగా పెరుగుతుంది. బాగా బలిసిన ,డబ్బులున్న వయస్సు మళ్లీనవాళ్లు తమకంటే చాలా చిన్నవాళ్ళైన అమ్మాయిలతో శారీరిక సంబంధాలు పెట్టుకుంటారు.
వాళ్లతో లివింగ్ టుగెదర్ లో ఉంటారు. ఊర్లకు వెళుతుంటారు. అమ్మాయిలకి కావలసినవన్నీ కొనిస్తూ ఉంటారు.. వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు. వాళ్లనే షుగర్ డాడిస్ అంటారు. ఇదే పని ఆడవాళ్లు చేస్తే, తమకంటే వయసులో చిన్న ఆయన మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే వాళ్లని షుగర్ మా మిస్ అని పిలుస్తారు. డేటింగ్, లివింగ్ రిలేషన్షిప్ వంటి పేర్లతో మారిపోతున్న నగర జీవనశైలి జాబితాలో ఇప్పుడు కొత్తగా షుగర్ డాడీ కల్చర్ కూడా చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాదులో బడా వ్యాపారవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు ఎండిలు , రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇన్ఫ్రా కంపెనీ అధినేతలు, ఫార్మా కంపెనీ డైరెక్టర్లు ఇలా చాలామంది డబ్బు ఉన్నవాళ్లు ఇప్పుడు షుగర్ డాడి కల్చర్ కి అలవాటు పడ్డారు. ఆర్థికంగా బలంగా ఉండి... వయసులో 50 ఏళ్లు దాటిన వాళ్ళు తమకంటే వయసులో చాలా చిన్న వాళ్ళయిన అమ్మాయిలతో రొమాంటిక్ బంధాన్ని కొనసాగిస్తున్నారు. డబ్బు ,లగ్జరీ లైఫ్ కోరుకునే సిటీలో
అమ్మాయిలు ఇప్పుడు షుగర్ డాడి లను ఆశ్రయిస్తున్నారు.
వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం, పెళ్లికి ముందు వ్యవహారాలు ఇవన్నీ సొసైటీలో కామన్. కానీ షుగర్ డాడి కల్చర్ పూర్తిగా భిన్నం. అతనికి ఆమెకు మధ్య 30.... 40 ఏళ్లు గ్యాప్ ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. డబ్బులున్న మగాళ్లు చాలామంది వయసులో తీర్చుకోలేని కోరికలన్నీ ఇప్పుడు డబ్బులు పడేసిఎంజాయ్ చేస్తుంటారు. డబ్బులు కావలసిన అమ్మాయిలు... లగ్జరీ గూడ్స్, బ్రాండెడ్ వేర్ కి అలవాటు పడిన వాళ్ళు అవసరాల కోసం తప్పని తెలిసినా కూడా ఎగబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాదులో కొంత మంది కుర్రాళ్ళు కూడా డబ్బున్న షుగర్ మామీలను సుఖపెట్టి ... లగ్జరీ నీడ్స్ ని తీర్చుకుంటున్నారు.
ఈ షుగర్ డాడి వ్యవహారం అంతా పరస్పర ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రేమ ఆప్యాయతల కంటే ఇద్దరి అవసరాలు ముఖ్యం. షుగర్ డాడీ తన పార్టనర్ కి డబ్బులు ఇచ్చి ఆమె ఖర్చులన్నీ భరిస్తాడు. ఇందుకు ప్రతిఫలంగా ఆమె నుంచి స్నేహం, సాన్నిహిత్యం, ఎమోషనల్ ,ఫిజికల్ సాటిస్ఫాక్షన్ దొరుకుతాయి. అయితే ఇవన్నీ డబ్బున్న వాళ్లకు మాత్రమే సాధ్యమవుతాయి. మధ్యతరగతి వాళ్ళు, కింది స్థాయి వాళ్లకు జీవన పోరాటం తప్పదు. కాకపోతే సిటీకి ఉద్యోగాల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది అమ్మాయిలు లగ్జరీ లైఫ్ కోసం ఇప్పుడు ఈ షుగర్ డాడీ కల్చర్ కి అలవాటు పడుతున్నారు.
హైదరాబాదులో ఓ పారిశ్రామికవేత్త కొన్నాళ్లుగా ఓ అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఓ నాలుగేళ్లు వ్యవహారం తర్వాత ఆ అమ్మాయి నాలుగు డబ్బులు కూడా వెనక వేసుకుంది. సిటీలో ఒక అపార్ట్మెంట్ . కార్ కొనుక్కుంది, కాస్త బంగారం కూడా పోగేసుకుంది. ఓ ఫైన్ డే తనకు అనుకూలమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ పారిశ్రామికవేత్త కూడా ఆ అమ్మాయి పెళ్లికి అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి సంబంధం కట్ అయింది. ఆ డబ్బున్న మారాజు మరో అమ్మాయిని వెతుక్కున్నాడు. ఇలా పూర్తి అండర్స్టాండింగ్ తో సిటీలో సూపర్ డాడి కల్చర్ నడుస్తుంది.
కొంతమంది షుగర్ డాడి లు... వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి శుక్రవారం సాయంత్రం దుబాయ్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. శని ఆదివారాలు అక్కడే ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు హైదరాబాద్ చేరుకుంటారు. కొంతమంది కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, హవాలా ఆపరేటర్లు, తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి గర్ల్ ఫ్రెండ్స్ ని వెంటపెట్టుకుంటూ వెళుతుంటారు. ఇద్దరి మధ్య పెద్ద ఎమోషన్స్ ఏమీ ఉండవు కనుక అనవసరం అనుకున్నప్పుడు విడిపోతూ ఉంటారు.
సిటీలో ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు, జాబ్ దొరకని అమ్మాయిలు కూడా సూపర్ డాడీ కల్చర్ కి అలవాటు పడ్డారు. కొంతమంది అమ్మాయిలు పనిగట్టుకుని షుగర్ డాడి ల పరిచయం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం.... ఆన్ స్క్రీన్ కనిపించడం ద్వారా షుగర్ డాడి లను ఆకర్షిస్తున్నారు.సరే ఇదంతా వ్యక్తిగతంగా వాళ్లని ఎవరు ప్రశ్నించలేకపోవచ్చు. కానీ ఒకరిని చూసి మరొకరు ప్రభావితం అవడం ఆందోళనకరం. అయితే సమాజంలో ఇలా ఉండేవాళ్ళు కేవలం ఒక్క శాతం మాత్రమే అన్నది మర్చిపోకూడదు. మిగతా 99 శాతం అవసరాలకు ఎలా పడితే అలా లొంగిపోకుండా జీవన సమరం సాగిస్తూనే ఉంటారు.