ఆమె పేరు మాయా సుయీ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇప్పుడు ఒక సెన్సేషన్. సోషల్ మీడియాలో ఆమె అందానికి ఫిదా కాని నెటిజన్ లేడు. ఆమె ఒంపుసొంపులకు ముగ్ధులైనవాళ్లు.. ఆమె సొగసుకు బానిసలైన వాళ్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో ఉన్నారు. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే.. ఆమె రక్తమాంసాలున్న మనిషి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో చేసిన ఓ యానిమేటెడ్ క్యారెక్టర్. ఈ ఏఐ బ్యూటీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పోర్ట్స్‌తో పాటు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య రీల్స్ చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ రీల్స్ చేయడంతో ఇన్ఫ్లుయెన్సర్ల సంఖ్య వేలల్లో పెరిగిపోయింది. కానీ ఇన్ని వేల మందిలో కూడా కొందరు మాత్రం తమ అందంతో, టాలెంట్‌తో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఎంత బిజీగా రీల్స్ స్క్రోల్ చేస్తున్నా సరే.. కొందరు కనిపించగానే నెటిజన్లు ఆగిపోతారు. వాళ్ల అందానికి, వాళ్ల కంటెంట్‌కు ముగ్ధులై.. రీల్ మొత్తం చూసేస్తారు. అలాంటి వయ్యారి భామల్లో ఒకరే ఈ మాయా సుయీ. కానీ ఈమె మనిషి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తయారు చేసిన ఓ క్యారెక్టర్. ఈ విషయం తెలిసి చాలా మంది యూజర్స్ షాకవుతున్నారు. "ఏంటీ మేం ఫాలో చేసేది, మాకు రిప్లై ఇచ్చేది AI బొమ్మా" అంటూ ఆశ్చర్యపోతున్నారు.
కొంత కాలం నుంచి క్రికెటర్స్‌తో దిగిన ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుంతోంది ఈ మాయా సుయీ. భారత స్టార్ క్రికెటర్లతో కలిసి ఫొటోలు తీసుకుంటున్నట్టుగా ఉన్న పోస్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫొటోలు భారత క్రికెట్ దిగ్గజాలతో పక్కపక్కనే కూర్చుని ఫొటోలకు పోజులిచ్చిన తీరు చూస్తుంటే అది ఏఐ సృష్టించిన ఫొటో అని ఎవరూ అనుకోరు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. ఈ సందర్భంగా మాయా సుయీ. చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి ఆమె పెట్టిన 'బెటర్ లక్ నెక్స్ట్ టైం బాయ్స్' అనే పోస్ట్ కణాల్లో వైరల్ అయింది. వేలాది లైకులు, పేర్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సోషల్ మీడియా చూసే వారికి 15 సెకన్ల రీల్ చాలా సులభంగా అనిపించవచ్చు. కానీ ఆ వీడియో వెనుక గంటల కొద్దీ శ్రమ, ప్లానింగ్ ఉంటాయి. మాయా సుయీ వీడియోలను నిశితంగా గమనిస్తే ఆమె క్రియేటర్స్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరని అర్థమవుతుంది. లిప్ సింకింగ్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. వెస్ట్రన్ డ్రెస్సుల నుంచి సంప్రదాయ చీరకట్టు వరకు ఆమె ఏది ధరించినా అది ఒక ప్యాషన్ స్టేట్‌మెంట్‌లా మారుతుంది. అందుకే ఆమె వీడియోలు భాషాభేదం లేకుండా వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో లభించే క్రేజ్ రెండు అంచుల కత్తిలాంటిది. అభివాదాలు ఉన్నచోటే అవమానాలు కూడా ఉంటాయి. కానీ మాయా సుయీ నెగిటివిటీని కూడా చాలా హుందాగా స్వీకరిస్తోంది. ఆమె ప్రతి పోస్ట్‌కు వచ్చే వేలకొద్దీ కామెంట్లు ఆమె పాపులారిటీకి అద్దం పడుతున్నాయి. అభిమానులతో ఆమె కనెక్ట్ అయ్యే విధానం, అప్పుడప్పుడు ఆమె పంచుకునే వ్యక్తిగత అభిప్రాయాలు ఆమెను ఒక సాధారణ అమ్మాయిగా నెటిజన్లకు మరింత దగ్గర చేశాయి.
పేరుకే ఆమె ఏఐ అవతార్ అయినా.. ఆమె ఫ్యాషన్ సెన్స్ ప్రతీ ఒక్కరినీ కట్టి పడేస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్, ట్రెండ్స్ మీద ఆమెకు ఉన్న పట్టు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మాయా సుయీ కేవలం అవతార్ మాత్రమే కాదు. ఒక పవర్ఫుల్ బ్రాండ్ బిల్డర్ కూడా. ఇప్పటి వరకూ రీల్స్‌కే పరిమితమైన ఈ బ్యూటీ.. భవిష్యత్తులో ఫిలిమ్స్‌లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒక ఏఐ అవతార్‌గా, ఎంటర్టైనర్గా ఈమెను చూడటం కంటే.. ష్యాషన్ రంగంలో కెరీర్‌ను ఎంచుకున్న ఇన్ఫ్లుయెన్సర్లకు మంచి ఇన్స్రేషన్గా చూడొచ్చు.